

జనం న్యూస్ 6 ఆగస్ట్ ప్రతినిధి (కాసిపేట రవి )
-మండలములో పెరుగుతున్న గృహ నిర్మాల డిమాండ్ కు అనుగుణంగా టేకు కలప బాధ్యత గణనీయంగా తగ్గింది, దీనితో అవసరాలు తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో టేకు కలప వ్యాపారం చేసేవారి దగ్గరికి వెళితే ధరల మండిపోతున్నాయి,అటవీ శాఖ అధికారులు మండలంలో పర్యవేక్షిస్తున్నారా ? మండలంలో కనిపించని అటవీ అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇల్లు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేదే టేకు కలప వ్యాపారస్తులుకు దగ్గరికి వెళ్లి ప్రధాన ద్వారం నిర్మించాలని అడగగ దానికి రూపాయలు పెద్ద మొత్తంలోడిమాండ్ చేస్తున్నారు, మొత్తం గృహప్రవేశనకు దర్వాజాలు తలుపులు కిటికీలు ఇలా మొత్తం ఇంటికి పెద్ద మొత్తంలో వరకు అవుతుంది మధ్యతరగతి కుటుంబాలు అన్ని రూపాయలు వేచించి ఇల్లు నిర్మాణం చేపట్టగలరా?? టేకు కలప వ్యాపారస్తులకు అంత ధర ఎందుకు అని అడుగుతే కింది స్థాయి నుండి పై స్థాయి అటవీ క్షేత్ర అధికారులకు ముడుపుల అప్పజెప్పాలని వ్యాపారస్తులు అంటున్నారు మరి ఈ కలపకు వ్యాపారస్తులు ప్రభుత్వానికి పనులు కడుతున్నారా?? లేకపోతే అటవీ శాఖ అధికారుల చేతివాటంతో నడుస్తుందా?? ఈ టేకు కలప వ్యాపారస్తుల వద్దకు అన్ని అనుమతులతో వస్తుందా??. వ్యాపారస్తులు దేశీయ విదేశీయ టేకు కలప మంచి నాణ్యత తీస్తున్నారా?? ఇలా అయితే సామాన్య ప్రజలకు అందని ద్రాక్షే నా?? గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ఎన్నో రూపాయలు వేచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానాకు రాజుల సొమ్ము రాళ్లపాలు అయినట్టు నత్త నడకల అటవీశాఖ అధికారుల తీరు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప వ్యాపారస్తులపైన దృష్టి సాధించి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా, టేకు కలప వ్యాపారస్తులు విచ్చలవిడి ధరలపై విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు