Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ అమ్మ కల్పనా దేవి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అభిరామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాలే అమృతం తల్లి పాలలో రోగనిరోధక శక్తి ఉంటుంది తల్లిపాలు తాగిన బిడ్డకు డయేరియా , నియోనియా దరిచేరవు అన్నారు తల్లిపాల విశిష్టత గురించి తల్లిపాలు ఇస్తే బిడ్డకు ఎంత క్షేమమో ప్రజలకు తెలపడం కోసమే తల్లిపాల వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం అని తెలిపారు కొత్తగా తల్లులైనటువంటి వారికి బాలింతలకి చిన్న చిన్న పిల్లల్ని అంగన్వాడికి తీసుకొచ్చే వారికి కూడా తల్లిపాలపై ఔన్నత్యం గురు నుండి అమృతంతో సమానమని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎ ఎన్ ఎం సాంబ లక్ష్మి అంగన్వాడీ టీచర్లు సృజన, అరుణ, విజయ కుమారి ఆశ వర్కర్లు గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు….