Listen to this article

-అంబేద్కర్ స్టార్ కృష్ణ డిమాండ్
జనం న్యూస్, జనవరి 27 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎన్నో ఏళ్లగా పరిష్కారం కానీ ఆర్టీసీ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనిఆంధ్రప్రదేశ్ బహుజన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబేద్కర్ స్టార్ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన1) 1.1,2019 సర్కులర్ ను అమలు చేయాలని 2) రాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్ల ఇంక్రిమెంట్లు పోయిన అందరికీ ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు.3) ఆర్టీసీ బస్సుల కండిషన్లు మెరుగుపరచాలని 4) ఆర్టీసీలో 30-40 మధ్య వయసు కలిగిన పదివేల రూపాయలు పెన్షన్ తక్కువ కాకుండా ఇవ్వాలని 5) గతంలో డ్రైవర్లు యాక్సిడెంట్ వంటి పరిణామాలు జరిగితే వేరే ఉద్యోగం కార్యాలయంలో ఇచ్చేవారు ప్రస్తుతం డ్రైవర్లను తొలగిస్తున్నారని ఈ విధమైన వైఖరితో కొంతమంది డైవర్ కుటుంబాలు వీధిని పడుతున్నాయని ఈ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.6) అనారోగ్య సమస్యలతో బాధపడే డ్రైవర్లకు కార్యాలయంలో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.7) కుల మతాలు అతీతంగా సామాజిక స్పృహతో పై అధికారులు వ్యవహార శైలి ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.