

జనం న్యూస్ ఆగష్టు 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సమైక్యవాదుల చేతిలో నలిగిపోతున్న తెలంగాణను కాపాడుకోవాలనే దృక్పథంతో జయశంకర్ సిద్ధాంతం రూపొందించారని అన్నారు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన జయశంకర్ సార్ స్పూర్తి గొప్పదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి జయశంకర్ అని అన్నారు.తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో అంకటి అప్పయ్య రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు,ఎంబి దేవదానం రిటైర్డ్ ఎంఈఓ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, సోమయ్య రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు హుజూర్ నగర్,మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
