

(జనం న్యూస్ 6 ఆగస్ట్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్యకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతివేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, గొర్రెల మేకల పెంపకo వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, ప్రజలు పాల్గొన్నారు,