Listen to this article

జనంన్యూస్. 06.నిజామాబాదు.

నిజామాబాద్ కమిషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) శ్రీ బస్వారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్) మాట్లాడుతూ 1934 ఆగష్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని, 1952 సంవత్సరం ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1954లో రాష్ట్రాల పునర్వీభజన కమీషన్ ముందు యువకుడైన జయశంకర్ ధాటిగా వాదించారు. కాకతీయ యూనివర్సీటీ వైస్ చాన్సలర్ గా ఎదిగారు. సామాజిక తెలంగాణ అంటూ ముందుకొచ్చి ఉద్యమ ధోరణులపట్ల స్పందిస్తూ, భౌగోళిక తెలంగాణ ను సాధించుకొన్న తరువాతే, మిగతాకోణాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుందని చెప్పేవారు. ” తెలంగాణ నా కల అని పదేపదే చెప్పేవారు అని తెలియజేశారు. ప్రతిఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యం ప్రతి ఒక్కరు కష్టపడాలని, భావితరాల కోసం బంగారుబాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.ఈ జయంతి సందర్భంగా ఎ.ఓ ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంటు శంకర్, బషీర్, వనజ, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, ఇన్స్పెక్టర్స్ రమేష్, శ్రీ విరయ్య, సతీష్ పోలీస్ కార్యాలయం సిబ్బంది సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది,ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది హజరుకావడం జరిగింది.