

అఖిలపక్షం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని గ్రంథాలయంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అనునిత్యం పాటుపడిన వ్యక్తి అని, మలిదశ ఉద్యమానికి పునాది వేసిన ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ప్రజలందరూ జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమేష్ జి, జానకి రెడ్డి, బిజెపి నాయకులు గణేష్ తంగరాజు, కొమ్ము రాందాస్, ఎర్రబోయిన రాజు, బిఆర్ఎస్ నాయకులు సభావత్ చంద్రమౌళి నాయక్, మూడవత్ లక్ష్మణ్ నాయక్, సొల్లోజు శేఖరా చారి, మహేష్, గాజుల రాము, తిరుపతమ్మ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.