

జుక్కల్ జులై 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం కేంద్రంలో బుధవారము ఉదయము ఆరు గంటల ప్రాంతంలో సిర్పూర్ మంజీర ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని అనుమతి పత్రాలు అడగడంతో పత్రాలు లేనందున డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా పట్టుకొని పత్రాలు లేనందున తగు చర్యల నిమిత్తం తాసిల్దార్ కార్యాలయం నందు ఉంచడం అయినది