

జనంన్యూస్. 06.సిరికొండ.ప్రతినిధి.
పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సిరికొండ ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ మాట్లాడుతూ గడ్కోలు గ్రామంలో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు 100, 102, సర్వే నంబర్లలో సాగ భూములకు పట్టాలిచ్చిందని, వాటికి కొత్త పట్టాలను ఇచ్చి రైతు బంధు రైతు బీమా అమలు చేయాలన్నారు. ఎలక్షన్ హామీ లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గాడ్కోల్ గ్రామ ప్రజలకు100, 102, పట్టాలు ఇప్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పేద రైతులకు కొత్త పట్టాలు ఇచ్చి రైతు భరోసా వర్తింపచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ సిరికొండ మండల అధ్యక్షుడు నిమ్మల భూమేష్, కార్యదర్శి పి ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గులాం హుస్సేన్, చిన్న గంగాధర్, జాకీర్, పి వై ఎల్ మండల అధ్యక్షుడు మల్కి సంజీవ్, జంగిల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.