

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ, ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ అద్వర్యం లో ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రమైన కోటప్పకొండ లో సహాయ కమిషనర్ గా కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న దాసరి చంద్రశేఖర రావుకు ఆధ్యాత్మిక సేవ రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారం 2025ను జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం తొలి ఏకాదశి మహాశివరాత్రి పుణ్య పవిత్ర మైన పండుగలను శక్తి వంచన లేకుండా భక్తులను ఉద్యోగస్తులను సమన్వయ పరుచుకుంటూ కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని దినదినాభివృద్ధి చేస్తున్న చంద్రశేఖర రావుకు ఈ పురస్కారం ఇవ్వటం సంతోషంగా ఉందని తెలియజేశారు, ఆలయ ప్రాంతంలో ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచటం భక్తులకు అందుబాటులో ఉంటూ నిత్యం క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు ఎల్లవేళలా సదుపాయాలు కల్పిస్తూ మంచి అధికారిగా గుర్తింపు పొందారని తెలియజేశారు, కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర రావు మాట్లాడుతూ జయ జయ సాయి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని వారు చేసే అన్నదాన కార్యక్రమాలు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చాలా గుర్తింపు పొందాయని వారికి ఎల్లప్పుడూ ప్రజల సహాయ సహకారాలు త్రికోటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరారు, అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం ఉత్తమ జాతీయ సేవా పురస్కారమును ఈవోకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పురోహితులు పాల్గొన్నారు, ఆలయ సూపర్డెంట్ చల్లా శ్రీనివాసరావు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు