

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ పల్నాడు జిల్లా ఇన్చార్జిగా& చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి గా వంజా జాన్ ముత్తయ్య మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ నుండి నియామక పత్రం అందుకోవడం జరిగింది.డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ ఆశయ సాధన కోసం బహుజన రాజ్యాధికారం కోసం, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ పేద వర్గాల శ్రేయస్సు సంక్షేమం కోసం అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లడమే పార్టీ ఉద్దేశం అని, ఆ విధంగా శక్తివంచన లేకుండా పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగ వంజా జాన్ ముత్తయ్య తెలిపారు.రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రామారావు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిపిల్లి రాజు, కూకట్లపల్లి ప్రసాద్, దార్ల రాజు, ఆర్.పి.ఐ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.