

(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి)
భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున విశ్వబ్రాహ్మణ సంగం నాయకులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత సిద్ధాంతకర్త, తెలంగాణ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91 జయంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం నిర్వహించి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ చేసిన అచంచల పోరాటం స్ఫూర్తిదాయకమని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో గర్రెపల్లి సత్యనారాయణ సంగం నాంపల్లి రమేష్ తంగళ్ళపల్లి రమేష్ మంత్రి గజానందo నూతి నాగరాజు, నేరడిగొండ మురళి పూసాల రాజు, గణముక్కుల చందు, నేరడిగొండ సమ్మయ్య, చే న్నోజు మనోహర్ పూసాల కిరణ్యబాబు పూసల రుద్ర శర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు