

జనం న్యూస్ ఆగష్టు 6 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రంలో నిర్మాణం అవుతున్న బౌద్ధ విహార్ గోపుర నిర్మాణం కొరకు మహారాష్ట్రలోని బౌద్ధ విహార్ గోపుర నిర్మాణాలను బుధవారం భారతీయ బౌద్ధమసభ నాయకులు పరిశీలించారు. మహారాష్ట్రలోని రాజుర తైసిల్ లోని వీరూర్ పంచాయతీలో గల కవిట్ నగర్, సింధీ గ్రామాలలో ఇటీవల బౌద్ధమత ఆచారం ప్రకారం నిర్మించిన బౌద్ధ విహారాలను పరిశీలించి దానిపై ఉన్న గోపుర నిర్మాణం గురించి గ్రామస్తులను అక్కడ ఉన్న బౌద్ధ ఉపాసకులను అడిగి తెలుసుకున్నారు. వాంకిడి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బౌద్ధ విహార్ కు సరిపడు గోపురం నిర్మాణం ఎత్తు వెడల్పు పొడవు ను అక్కడి వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహ సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కార్, వాంకిడి మండల భారతీయ బౌద్ధ మహా సభ అధ్యక్షులు దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే, ఉపాసకులు రమేష్ డోంగ్రే, కాంట్రాక్టర్ నానాజీ తదితరులు పాల్గొన్నారు.