

జనం న్యూస్ జూలై 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మట్టి గణపతిని పూజిద్దాం గణపతి కృపకు పాత్రులగుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విడనాడదాం. అనే నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ మేము మా ఇళ్లల్లోమట్టి గణపతిని పూజిస్తాం మా వీది లో కూడా మట్టి గణపతితో చేసిన గణపతిని పూజిస్తాం. అనే నినాదంతో మార్మోగుతూ భాష్యం హై స్కూల్ విద్యార్థులతో ఈరోజు ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగినది. అనంతరం వినాయక ఉత్సవ నిమజ్జనొత్సవ కమిటీ చైర్మన్. ఆడారి కుమారస్వామి మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు సమావేశాలు ఆగస్టు 20 వరకు జరుగుతాయని సుమారు50 నుంచి 70 సదస్సులు పాఠశాలలో బహిరంగ ప్రదేశాల్లో జనం ఎక్కువగా గుమ్మి గూడిన ప్రాంతాల్లో. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చైతన్యం రావాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమని లోక కళ్యాణార్థం భక్తులకు విఘ్నాలు తొలగించి. అందరి కుటుంబాలలో సుఖశాంతులతో ఉండాలని గాలి నీరు కాలుష్యం అవకుండా పర్యావరణ రహిత విగ్రహాలను తయారు చేయాలని అలాంటి విగ్రహాల్ని నిమజ్జనం చేయాలని తద్వారా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకునేవారు అవుతామని ఈ సందర్భంగా ఆడారి కుమారస్వామి తెలిపిరి. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రమణ మరియు సిబ్బంది కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనిరి.//