

జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గుర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న బస్ గిరిడ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. కారు డ్రైన్ చేస్తున్న గిరిడ సర్పంచ్ సూరిబాబుకి గాయాలయ్యాయి. స్థానికుల సమచారంతో అతనిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు.