

జనం న్యూస్ జనవరి 27 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :- మండల కేంద్రమైన గోకవరంలో ఈ గోకవరం యునైటెడ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జనవరి 27వ తారీకు ఎలక్ట్రిషన్ డే గా పరిగణించి ఘనంగా వేడుక జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మాజీ జడ్పిటిసి పాలూరు బోసు బాబు మాట్లాడుతూ బల్బును కనిపెట్టిన అటువంటి థామస్ అల్వా ఎడిసన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 27వ తారీకుని ఎలక్ట్రిషన్ డే గా పరిగణంలో తీసుకోవడం జరిగిందని,ఈ ఎలక్ట్రీషియన్ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైనదని దానిని అందరూ సమాజానికి ఉపయోగపడేలాగా కాపాడుకుంటూ సమాజాభివృద్ధికి మరియు ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడేలాగా అందరూ కూడా కృషి చేయాలని కొనియాడారు. తదుపరి జెండా ఆవిష్కరణ చేసి అందరికీ స్వీట్స్ కంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గసభ్యులు, మరియు ఎలక్ట్రిషన్ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.