

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలోని ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్ఐ లేదా సిఐ స్థాయి అధికారులు మరియు దత్తత గ్రామాల కానిస్టేబుళ్ళు ‘పల్లె నిద్ర’ చేపట్టే విధంగా అధికారులను ఇప్పటికే ఆదేశించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 5న తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ‘పల్లె నిద్ర’ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని చుతున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే ‘పల్లె నిద్ర’ ప్రధాన లక్ష్యంమని అన్నారు. అలాగే, గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు ‘పల్లె నిద్ర’ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలతోను, యువతతో పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా మమేకమై మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్ళొద్దని, చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని కోరుతున్నామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా మన్నారు. అపరిచిత వ్యక్తులకు ఒ.టి.పి.లను చెప్పవద్దని, అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, ఎ.పి.కే. ఫైల్స్ ను క్లిక్ చేయవద్దని, సైబరు మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేకంగా రూపొందించిన ‘శక్తి యాప్’ను వినియోగించి, ఆపద సమయంలో రక్షణ పొందవచ్చునో వివరిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో ‘వల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 300 గ్రామాల్లో పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ చేపట్టారన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను నేరుగా క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, పరిష్కరించేందుకు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.