

జనం న్యూస్ 07 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం పేరిట గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల నుండి ఒకే ప్రదేశంలో విధులు నిర్వహిస్తున్న వారిపట్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలు జరిగిన సంఘటన అందరికీ విధితమే. మండలంలో గల గుర్ల తమ్మి రాజుపేట గ్రామస్తులు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో ఐదు సంవత్సరాలు సేవలందించిన సచివాలయ సిబ్బందిని గౌరవించి వారి సేవలను గుర్తించి వారిని సన్మానించారు. మాజీ వైస్ సర్పంచ్ చొక్కాకు సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శి ఎల్ ముత్యాల నాయుడు అధ్యక్షతన టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ముఖ్యఅతిథిగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చలుమూరి వెంకట్రావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు సచివాలయ సిబ్బంది గ్రామంలో చక్కటి సేవలు అందించి మంచి పేరు పొందినారు అని వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సిద్దల లక్ష్మి, ఎంపీడీవో భానుమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో విమల కుమారి, గ్రామ పెద్దలు, సాహోద్యోగులు తదితరులు పాల్గొన్నారు.