Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోవిద్యాధికారి మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్శనలో ఎం పి పి ఎస్ గౌతాపూర్ మరియు ఎం పి పి ఎస్ మల్లక్క చెరువు తండా పాఠశాలలు ముఖ్యంగా పేర్కొనదగినవిగా నిలిచాయి. ఈ పర్యటన సందర్భంగా 1 నుండి 5వ తరగతుల వరకు తరగతులలో శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థుల పనితీరు, వర్క్బుక్లను పరిశీలించడం, పాఠ్య ప్రణాళికల అమలు వంటి అంశాలను గమనించడం జరిగింది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు ఎఫ్ ఎల్ ఎన్ ఎంతో ప్రాధాన్యత కలిగినవని ఈ సందర్భంగా శ్రీ బి. విట్టల్ వివరించారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలలో గుణకారము, భాగాకారము వంటి గణితానికి సంబంధించిన మౌలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ సర్ మరియు జిల్లా విద్యాధికారి గారి దృష్టికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్శనలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తో పాటు, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ ఆదిత్య కూడా పాల్గొన్నారు. వారు కూడా పిల్లల శిక్షణా ప్రమాణాల్లో మెరుగులకు గుర్తింపు ఇచ్చి, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు ఈ తరహా పర్యటనలు గ్రామీణ స్థాయిలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు తెలిపారు.