

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఉచిత విద్యుత్ ఆమోదం హర్షణీయం.
నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు నంద.
-చిలకలూరిపేట/ నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామని నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాయి బ్రాహ్మణులకు 150 నుండి200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు ఆమోదం తెలపటం హర్షణీయమని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసిన సి.యంచంద్రబాబు, డిప్యూటీ సి.యంపవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు20 నుంచి 25 వేల రూపాయలకు పెంచడం పాలకమండలి లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని ప్రకటించటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని మాటలకే పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులకు పెద్దపీట వేసిందని. బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధినీ చాటుకుందన్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణలు తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.