

జనం న్యూస్ ఆగస్టు 06 నడిగూడెం
మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన గుండు సుభద్ర భర్త వెంకన్న తన పొలంలో నారు మడి మీద కలుపు మందు చల్లారని పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మేరకు కంపాస్ నగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సంధ్యారాణి లు బుధవారం నారుమడిని పరిశీలించారు. పొలంలో నారు, మట్టి నమూనాల సేకరించి, విశ్లేషించి ఫలితాలను జిల్లా వ్యవసాయ అధికారికి అందజేస్తామని తెలిపారు. ఏవో దేవ ప్రసాద్,ఏఈఓ ఉప్పయ్య హెచ్ సి. అప్పారావు పాల్గొన్నారు.