

మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 07 (జనం-న్యూస్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కుందురు నాగార్జునరెడ్డి మరోసారి కార్యకర్తల మనోబలాన్ని పెంచే విధంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరైనా,ఏదైనా కష్టంలో ఉన్నా తాను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని ప్రకటించారు. అధికార పక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఒక దురదృష్టకర ఆనవాయితీగా మారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం అధికారంలో లేని సమయంలో కూడా ప్రజలకు సేవ చేయడం, పార్టీ బలోపేతానికి పని చేయడం గొప్ప విషయం. అలాంటి త్యాగ స్వభావం గల నాయకులను, కార్యకర్తలను పార్టీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు, అని కుందురు నాగార్జున రెడ్డి స్పష్టంగా తెలియజేశారు. ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి కార్యకర్త, ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ తమ వంతు బాధ్యతగా ప్రచారం జరపాలని సూచించారు. పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, జగనన్న హౌసింగ్, సచివాలయాల వంటి అభివృద్ధిని గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో, సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచే, విమర్శించే పోస్టులు పెట్టరాదని కూడా స్పష్టంగా తెలిపారు. పార్టీ విధానం ప్రజల సంక్షేమం అన్న ధ్యేయంతో ముందుకెళ్తుందని, ప్రతి కార్యకర్త అందుకు భాగస్వామిగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో మన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మనం అందరం కలసి మన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా తయారు చేద్దాం. ప్రజలతో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందాం. నేను ఎప్పటికీ మీతో ఉన్నాను. మీకు అండగా ఉంటాను.ప్రతిక్షణం మీకు తోడుగా ఉంటాను,అని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆయన కోరారు.నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పార్టీ పరంగా ఎవరైనా ఇబ్బందులలో ఉంటే తానే ముందుంటానని కుందురు నాగార్జునరెడ్డి హామీ ఇచ్చారు.