

జనం న్యూస్: 28 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి. నేటి ఉదయం 10:00 గంటలకు నల్లగొండ పట్టణం, గడియారం సెంటర్ నందు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లోని అన్ని మండలాలు మరియు మున్సిపాలిటీలలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళా మణులు, విద్యార్థి నాయకులు, రైతులు మరియు కెసిఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.