

బిచ్కుంద ఆగస్టు 7 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె. అశోక్ అన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్ 1&2 సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్య క్రమం లో విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటరు . సరైన సమయంలో వర్షాలు పడాలన్న వాతావరణం సమతుల్యం ఉండాలన్న మొక్కలు కాపాడాలన్నారు . మొక్కలు నాటడంతో పాటు కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.