

జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “DGPS ఉపయోగించి సర్వేయింగ్ యొక్క ఆధునిక పద్ధతులు” అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి డి.వి.ఎన్.ఎస్. వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరై, వర్క్షాప్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఇలాంటి శిక్షణలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సురేశ్ బాబు గారు విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం పెరిగేలా ఇలాంటి కార్యాక్రమాలు ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని సివిల్ విభాగాధిపతి డా. ఎస్. చక్రవర్తి గారు విజయవంతంగా నిర్వహించారు.
ఈ వర్క్‌షాప్‌కు ఆల్ టెర్రా సొల్యూషన్స్, విశాఖపట్నం సంస్థ నుండి ఆర్. గోపీ కిషోర్ గారు ముఖ్య వక్తగా విచ్చేసి, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) పరికరాన్ని ఉపయోగించి ఆధునిక సర్వే పరిశోధనపై విపులంగా వివరణ ఇచ్చారు. తరువాత ఫీల్డ్‌లో ప్రత్యక్ష డెమో ద్వారా పరికర ఉపయోగాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఈ వర్క్షాప్ ద్వారా ఆధునిక సర్వే పద్ధతులపై ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, నూతన సాంకేతికతపై అవగాహన పెరిగిందని తెలిపారు. ఈ తరహా శిక్షణలు భవిష్యత్తులో వారికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.
