Listen to this article

బిచ్కుంద జనవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ సెమిస్టర్ సప్లమెంటరీ ఫలితాలు నేడు తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి లో COE ప్రొఫెసర్ యం .అరుణ,ACOE ఫ్రొఫెసర్ శాంత బాయి ల చేతులమీదుగా విడుదల అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల COE డాక్టర్ జి. వెంకటేశం, కళాశాల ACOE . వై సంజీవరెడ్డి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.