Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగపరుచుకొని, తమ కలలను సాకారం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో .. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల సహకారంతో `12వ తేదీన మద్దిరాలలోని సాధినేని చౌదరయ్య కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీయువకులు భారీ సంఖ్యలో హాజరై, తమ జీవితాలు చక్కదిద్దుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. గురువారం ఆయన తన నివాసంలో జాబ్ మేళా కరపత్రాల్ని ఆవిష్కరించి అధికారులు.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ యంత్రాంగానికి, స్థానిక టీడీపీ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. అందరూ సమిష్టిగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని.. దూర ప్రాంతాల నుంచి నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ప్రత్తిపాటి తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే ప్రముఖ కంపెనీలు.. పరిశ్రమల యాజమాన్యం అర్హత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, వారి జీవితాలను ఉన్నతమార్గంలో నడిపించాలని ప్రత్తిపాటి కోరారు. నియోజకవర్గ యువత చురుగ్గా ఉంటుందన్న ప్రత్తిపాటి.. తమ ప్రాంత వాసుల్ని ఎంపిక చేయడం వల్ల కంపెనీలకు మేలే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి, పోపురి రాఘవయ్య, తుపాకుల అప్పారావు, దశరథ రామయ్య, చౌదరి, జిల్లా నైపుణ్యాధికారి ఈ.తమ్మజీరావు, ఆడిషన్ అధికారి రామాంజనేయులు, కోఆర్డినేటర్ సురేష్ తదితరులున్నారు.