

జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మహిళా సంరక్షణ, సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానాలు,డ్రగ్స్ చెడు వ్యసనాలు వల్ల నష్టాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ,, ర్యాగింగ్, మొదలగు వాటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐ.పి.ఎస్. ఉత్తర్వులు ప్రకారం ,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ గారు మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారి ఆదేశాల ప్రకారము , కాట్రేనికోన మండలంలో కందికుప్ప జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ విద్యార్థులకు పైన తెలిపిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ ఈ సందర్భంగా మహిళా సంరక్షణకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాముఖ్యతను, పోలీస్ శాఖ మహిళలకు కల్పిస్తున్న రక్షణ వ్యవస్థను తెలియ చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సు నందు అవినాష్ గారు మాట్లాడుతూ… సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు, యువకులు అనవసర లింక్‌లను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాల గురించి వివరించారు. గుర్తుతెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్‌కాల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్, చాటింగ్‌కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు. తమ వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ఫోన్‌లలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి , యువత చెడు అలవాట్లవైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు, కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్దులు మొదటి నుంచే దూరంగా ఉండాలని హితబోధ చేసినారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహిళా సంరక్షణ, శక్తి app యొక్క విశిస్టమైన ఉపయోగాలు, విద్యార్థుల క్రమశిక్షణ, పేరెంట్స్, టీచర్స్, విద్యార్థుల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం జరిగింది.ధన్యవాదములు. కాట్రేనికోన పోలీసు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.
