

జనం న్యూస్ ఆగస్టు 7జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం
తుంగూరు గ్రామంలో కే.డి.సి.సి బ్యాంకుకు దగ్గరలో విద్యుత్ స్తంభం పగులులు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. కే.డీ.సీ.సీ బ్యాంకుకు నిత్యం ప్రతిరోజు చాలామంది రైతులు వస్తారని అలాగే రోడ్డు గుండా నిత్యం వాహనాల రాకపోకలు ప్రజల రాకపోకలు జరుగుతుంటాయని, పగులు వచ్చిన విద్యుత్ స్తంభంతో భయం భయంగా ఉంటున్నట్టు చుట్టుపక్కల పరిసరాల ప్రజలు తెలుపుతున్నారు. విద్యుత్ స్తంభం మధ్యలో కింది భాగంలో చిన్నచిన్న పలుగులు ఏర్పడి ఉందని, కడ్డీలతో ఫిక్స్ చేసిన భాగంలో సపోర్టుతో నిలబడి ఉందని వేగంగా వీచే గాలులతో ఏ క్షణంలోనైనా విరిగి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. నిత్యం జనావాసంతో రద్దీగా ఉండే ప్రాంతం కావడం వలన ఎటువంటి ప్రమాదం జరగకముందే వీలైనంత తొందరగా విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి పగులులు ఏర్పడిన విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని గ్రామ ప్రజలు యువకులు కోరుచున్నారు.
