Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట/ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పైన దాడులు చేయటం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అలా శివ గోపి యాదవ్ అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపైనే ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గరనుండి ఎక్కువగా దాడులు చేయటం జరుగుతుందని అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే ప్రధానమైనవి అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.