

బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 07 (జనం-న్యూస్)
కొమరోలులో వైసీపీ కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా, వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
