

పయనించే సూర్యుడు ఆగస్ట్ 8(సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట పట్టణ పరిధి సాయినగర్ ప్రాంతం నందు గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించక పోవడంతో చెత్త దిబ్బల పేరుకుపోయింది. కురుస్తున్న వర్షాలకు ఈ చెత్త కుళ్లిపోయి దుర్గంధమైన వాసన వస్తున్నది. ఈ ప్రాంతంగుండానే పాఠశాలకు పిల్లలు పోవాల్సి వస్తున్నది. ఈ దుర్గంధమైన వాసన వల్ల రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. పురపాలక అధికారులు ఇప్పటికైన స్పందించి ఈ చెత్త ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.


