Listen to this article

జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌ సమీపంలోని వెల్డింగ్‌ షాప్‌లో సిలిండర్‌ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని KGH సూపరింటెండెంట్‌ వాణి తెలిపారు. ఈ నలుగురిలో ముగ్గురు 90% పైనే గాయపడ్డారని చెప్పారు. వీరిని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించామన్నారు. CHముత్యాలు పరిస్థితి మరింత క్రిటికల్‌గా ఉందని బతకడం కష్టమే అన్నారు. వీరిని కాపాడేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తామన్నారు.