

జనం న్యూస్ ఆగస్టు 07:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమిపండుగను పురస్కరించుకొని రాఖీ పండుగను పాఠశాల ప్రాంగణంలో హర్షాతిరేకాలతో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టడంతో పాఠశాలలో సోదర, సోదరీ భావనను ప్రతిబింబించే ప్రాముఖ్యతను మన పురాణాల నుండి మనకు వచ్చిన రాఖీ సంప్రదాయాన్నిఉపాధ్యాయురాలు స్వప్న తెలియజేస్తూ విద్యార్థులను ఉత్సవపరిచారు.
అలాగే రాఖీ పండుగ ద్వారా భారతీయ సాంప్రదాయాల్లోని సోదరభావాన్ని మరియు మహిళల రక్షణకు ఇచ్చే ప్రాముఖ్యతను విద్యార్థులకు బయో సైన్స్ ఉపాధ్యాయులు నవీన్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, రాములు, రవి, చక్రపాణి ,దేవానంద్ గౌడ్, ఆనంద్ ,భూపతి ,విజయ, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
