

(జనం న్యూస్ 8ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి )
మంచిర్యాల జిల్లా భీమారం మండల గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనలో చర్యలు శూన్యము. బజారులో ఏ వస్తువు కొన్న ప్లాస్టిక్ సంచులు అందిస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో సంబంధితఅధికారులు చొరవ చూపటం లేదు. దీనికి కారణం సంచులతో డబ్బులు వస్తుంటే……. ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని మరిచిపోతున్నారనే అపవాదు ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి భావితరాల వారికి మనం ఆస్తులను ఇవ్వకపోయినా పరవాలేదు…. కానీ కలుషితమైన పర్యావరణాన్ని మాత్రం ఇవ్వకూడదు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం బాగా బ్రతికం చాలదా….. అనే రీతిలో ప్రస్తుత జనాలు వ్యవహరిస్తున్న తీరు చాలా అన్యాయం. మన భావితరాల వారికి చక్కనైన వాతావరణాన్న కల్పించటంలో… ప్రస్తుత తరం వారి లక్ష్యంగా ఉండాలి. దానికి తోడు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పై పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. వార్త వచ్చిన వెంటనే స్పందిస్తున్న అధికారులు తరువాత కనీసం వాటి జోలికి కూడా వెళ్లకపోవడం విడ్డూరం. మండల కేంద్రంలో ప్రతి అంగుళం మీద పర్యవేక్షణ ఉంటున్న అధికారులకు…. ప్లాస్టిక్ గోడౌన్లు ఎక్కడ ఉంటాయో తెలియక పోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయంపై అధికారులు స్పందించి ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం విధించి ఆదర్శ మండలగా తీర్చిదిద్దుతారని కోరుకుందాం. ప్రజలు కూడా అధికారులకు సహకరించి, పూర్తిగా ప్లాస్టిక్ బ్యాగుల రహిత మండలం గా తీర్చిదిద్దుకుందాం.