

.వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట
జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి దేవి పంచలో విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా నిర్వహించినారు. శ్రీ మహాలక్ష్మి పంచలోహ విగ్రహం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం నుండి తెచ్చిన దాత మాజీ సర్పంచ్ అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి సరోజన దంపతులు వారి కుమారులు తెప్పించినారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు శ్రీ వేదాంతం హరీష్ ఆచార్యులు శ్రీ మహాలక్ష్మి విగ్రహానికి విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనము జలాధివాసం దాన్యాధివాసం పంచామృతాలతో అభిషేకం హోమం నిర్వహించి వేదమంత్రాల మధ్య ప్రాణ ప్రతిష్ట చేశారు శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు భక్తులు మంగళ హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టారు దేవాలయంలో శ్రావణమాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి వినుకొండ శంకరాచారి గట్టు సురేష్ భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు….