

జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబా ల గ్రామంలోని సచివాలయం నందు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మల్లెల జగదీష్ తెలిపారు, సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ కార్డులో మార్పులు,చేర్పులు ఉన్నట్లయితే వాటిని ఇక్కడ పరిష్కరించుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు