

జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జన్నారంలో జరిగిన సైబర్ నేరాల కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశామని మంచిర్యాల డీసీపీ ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్నారం సైబర్ కేసులో విజయనగరానికి చెందిన బి.జయవర్థన్, ఎం.సింహాద్రి, పి.జగదీశ్, ఎల్.తేజాను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.