Listen to this article

ఎం పి డి ఓ పూర్ణ చంద్రోదయ కుమార్

జనం న్యూస్ ఆగస్టు 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

బీబీపేట మండలంలోని శేరిగల్లీలో శుక్రవారం పర్యటించిన మండల అభివృద్ధి ఆధికారి పూర్ణచంద్రోదయ కుమార్,ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ,పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా దోమ ,ఈగలు పెరగకుండా ఉండి వాటిద్వారా వచ్చే డెంగీ, మలేరియా,విషజ్వరాలు ,వాంతులు, విరేచనాలు కాకుండా అరికట్టవచ్చని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఈ ఓ గూడ రమేష్ ,గ్రామ ఆరోగ్యకార్యకర్తలు హరిప్రసాద్ ,సుశీల ,ఆశ కార్యకర్త గంగజ్యోతి పాల్గొన్నారు.