

జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
చింతా వారి వీధి నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై చింత వారి వీధి చిన నాలుగు రోడ్డు జంక్షన్ వరకు పనులు పూర్తయిన తర్వాత పెరుగు బజారు నుండి గాంధీ బొమ్మ విస్తరణలో కొంతమంది భవన యజమానులు కోర్టు వెళ్లడం, కొంతమందికి టీడీఆర్ లు అందకపోవడంతో తాత్కాలికంగా పనులు జరగలేదని, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కూటమి నాయకులు సహకారంతో ప్రధాన కమిషనర్ గా కేతన్ గార్గే వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే టీడీఆర్ లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారని, అలాగే ఇంజనీరింగ్ అధికారులకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని ఎస్ ఈ కి నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారని 84వ ఇశ్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పీలా నాగ శ్రీను దూలం గోపి పెతకంశెట్టి జగన్మోహన్రావు సాలాపు మోహన్ తలారి ప్రసాదు పెంటకోట గణేష్ చేబోలు సత్య భవన నిర్మాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు.//