

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి
సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్
జనం న్యూస్,09ఆగస్టు,జూలూరుపాడు:
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు.శనివారం కొమురం భీమ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అప్పాల ప్రసాద్ పాల్గొని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి,ఆదివాసి జెండా ను ఆవిష్కరించారు.అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సభ నిర్వహించి, ఆదివాసి ఆడబిడ్డలతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆదివాసులు చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. ఆదివాసి దినోత్సవం అంటే కేవలం ఆదివాసులు జరుపుకునే పండగ కాదని, ఆదివాసుల సంస్కృతి, అడువులు, స్వచ్ఛమైన నీరు, అనుభవిస్తున్న ప్రజలందరూ జరుపుకోవాల్సిన పండగ అని అన్నారు. జల్ జంగల్ జమీన్ ఇది రాజకీయ నినాదం కాదని, ఎక్కడైతే భూమి పచ్చగా, అడవి శాతం ఎక్కువగా ఉండి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ నివసించే ప్రజలు, పశు పక్షాదులు సుభిక్షంగా ఉంటాయని, ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఆదివాసి బిడ్డలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర, ఐటీడీఏ నుండి ఆదివాసీలకు వచ్చే పథకాల గురించి పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. ఆదివాసీల పోడు భూములలో ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అదే విధంగా ఆదివాసీలు జరుపుకునే జాతర్లకు అయ్యే ఖర్చులతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రతి ఆదివాసి గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమ అనంతరం వివిధ గ్రామల పెద్దలకు, ఆదివాసి పూజారులకు సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆదివాసి నాయకులు తెల్లం నరసింహరావు, యదలపల్లి వీరభద్రం, మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీత కుమారి, మాజి వైస్ ఎంపిపి యదలపల్లి కళ శ్రీ, మాజి సర్పంచ్ తాటి రోహిణి, బచ్చల రేణుక, పూనం సూరయ్య, తెల్లం మహేష్, మలకం వీరభద్రం, వూకే వీరభద్రం, బచ్చల రాంబాబు, కల్తీ రామయ్య, యదలపల్లి వీరస్వామి, సోడె రోశయ్య, సోడే శ్రీరాములు, సిద్ధబోయిన రామ్మూర్తి, సిద్ధబోయిన పుల్లారావు, సిద్దబోయిన మోహన్, ఇర్పా రామారావు, కాలం నరసింహారావు, మడి రవి, కొర్సా రమేష్, బచ్చల అశోక్, వర్షా చంద్రయ్య
సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్, జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్, గ్రామ పెద్దలు, యువత, ఉద్యోగస్తులు, మహిళలు, గిరిజన పూజారులు తదితరులు పాల్గొన్నారు.