

జనం న్యూస్ ఆగస్టు 11 అమలాపురం
విజయవాడ జింఖానా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ సెమినార్లో అయినవిల్లి బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన యనమదల వెంకటరమణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మూర్తి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. బీజేపీలో కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోనసీమ మెడికల్ లేబోరేటరీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.