

రాష్ట్రాభివద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా, నందిగామ,జనవరి 27 : ‘ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు సిసి రోడ్ల ప్రారంభోత్సవం మరియు అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండ వారి పాలెం, పెద్దవరం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 35 లక్షల రూపాయల సీసీ రోడ్లు మరియు 193:00 లక్షల రూపాయలు కోనాయపాలెం (కాట్రేనిపల్లి – పెద్దవరం) బండిపాలెం గ్రామ తారు (బీటీ) రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామంలో 17 లక్షల 50 వేల రూపాయల సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. క్రక్స్ బయోటెక్ కంపెనీ వారి సహకారంతో కొత్త బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన మంచినీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రక్స్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.