Listen to this article

జనం న్యూస్. ఆగస్టు11. మెదక్ జిల్లా. నర్సాపూర్.

నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివిరాజు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి.కళాశాలలో బీటెక్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థులకు పరిచయ వేదిక కార్యక్రమం ఇండక్షన్ ప్రోగ్రాంను.ఘనంగా నిర్వహించారు.ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను స్వాగతిస్తూ, క్లబ్‌లు,హ్యాకథాన్‌లు, ప్లేస్‌మెంట్ అవకాశాలు,విష్ణు స్పేస్ ఇంజినీరింగ్ ల్యాబ్ వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కెవి.విష్ణు రాజు పాల్గోని.వారు మాట్లాడుతూ ఎంచుకునే కోర్సుల కంటే కోడింగ్,వృత్తి నైపుణ్యాలకు కమ్యూనికేషన్ స్కిల్స్ బావవక్తీకరణకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు.విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా రాణించాలని సూచించారు.సిలబస్‌కి మించినది అతి ముఖ్యమైనది జీవితమని అన్నారు.హ్యాకథాన్‌లు,గోకర్ట్ వంటి పోటీలలో పాల్గొనాలని తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు జాతీయ స్థాయిలో పొందుతారని చెప్పారు.విద్యార్థులు చదువుకునే సిలబస్ కంటే జీవితంలో అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువగా ఉంటుందని దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా. ట్విట్టర్,ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్లతో దూరంగా ఉండాలని ఏది అబద్ధము ఏది నిజమో తెలుసుకొని తద్వారా ఇతరులకు పంపించాలని అప్పుడే మంచి ఆలోచనలకు బంగారు బాట వేస్తుందని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు చాల దూరంగా చదువులకు దగ్గరగా ఉంటూ మంచి పుస్తకాలు చదవాలని సూచించారు.
ప్రథమ సంవత్సరంలో ప్రస్తుత సెమిస్టర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు చైర్మన్.వైస్ చైర్మన్ లు సన్మానించారు. ఫ్రెష్‌మన్ ఇంజినీరింగ్ కిట్ ఒరియంటేషన్ ప్రోగ్రామ్ పుస్తకాలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా విష్ణు విద్యా సంస్థల వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్,కళాశాలలో ఉన్నతమైన విద్యతోపాటు అధ్యాపకుల మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు సానుకూలంగా ఆలోచించి,కళాశాల వనరులను వినియోగించుకొని,తాము ఎంచుకున్న రంగాల్లో విజయాన్ని సాధించాలని ఆయన విద్యార్థులకు ప్రోత్సహించారు.డైరెక్టర్ డాక్టర్. కె.లక్ష్మీ ప్రసాద్, మాట్లాడుతూ బివి రాజు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కళాశాల అందించే అద్భుతమైన బోధన వాతావరణం,ప్రపంచ స్థాయి సదుపాయాలు,విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే. అకాడమిక్ ఇండస్ట్రీ రిలేషన్స్ డైరెక్టర్ సతీష్ చంద్ర, రవికిరణ్, డాక్టర్ రాజు.శ్రీ కాంతారావు .కళాశాల మేనేజర్ బాపిరాజు,సురేష్. మల్లికార్జున్.వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.