

జనం న్యూస్,ఆగస్టు11,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ లో గల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నివాసం వద్ద అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో జరగనున్న జిల్లా స్థాయి భజన పోటీలు ఆహ్వాన గోడ పత్రికను సోమవారం నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ భజన పోటీలు ఓం భారతీ శక్తి పీఠం వ్యవస్థాపకులు గురూజీ భారతానంద మహారాజా పర్యవేక్షణలో శ్రీ గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 17 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తున్నట్లు గౌరీ సంఘం సభ్యులు తెలిపారు.