Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ కెనరా బ్యాంకు శాఖను హాలియాకు తరలించ వద్దంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గణేష్ తంగరాజు, కొమ్ము రాందాస్ లు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీనాయకులు మాట్లాడుతూనాగార్జునసాగర్ హిల్ కాలనీలో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖను హాలియాకు తరలించవద్దని, 100 కోట్ల టర్నోవర్ కలిగి 15 వేల ఖాతాదారులు, 2500 బంగారు రుణ ఖాతాలు కలిగి ఉన్న కెనరా బ్యాంకును తరలించవద్దని, వృద్ధ పెన్షన్ దారులను, ఖాతాదారులను ఇబ్బందుల పాలు చేయరాదని, ఖాతాదారులకు ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకును తరలించటం చట్ట విరుద్ధమని ఇట్టి విషయమై ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని వారు తెలిపారు.