

జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా మండలంలోని 36 ప్రభుత్వ స్కూళ్లలో 6 ప్రైవేట్ స్కూళ్లలో 54 అంగన్వాడి సెంటర్లలో ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు ఈ కార్యక్రమంలో 5140 ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు 4682 మంది పిల్లలకు 91.08% టార్గెట్ ను పూర్తి చేశారు మిగిలిపోయిన పిల్లలకు తేదీ 18 8 2025 సోమవారం రోజున పూర్తి చేయడం జరుగుతుందని మండలం లోని ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ ఎన్ సాయికృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్ల ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్స్ అంగన్వాడీ టీచర్స్, హెల్త్ సూపర్వైజర్స్ ఏఎన్ఎమ్స్,ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు…