Listen to this article

జనం న్యూస్,ఆగస్టు11, అచ్యుతాపురం:

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర రావు, ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని స్వయం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో కార్మికులు నష్టపోతారని,వీరికి వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి రూ.25 వేలు భృతి ఆటో లైసెన్స్ పొందిన ప్రతి కార్మికుడికి ఇవ్వాలని,ఇన్సూరెన్స్ లు,జరిమానాలు వంటివి రద్దు చేయాలని ఉబర్, వాలా వంటి సర్వీసులు ప్రభుత్వమే నిర్వహించాలని, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని, ఆటో కొనుగోలుకు ఐదు లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొండకర్ల ఆటో స్టాండ్ నాయకులు ఈశ్వరరావు,సంతోష్, అనకాపల్లి చిరునీడస్టాండ్ నాయకులు రాము, అచ్యుతాపురం చోడమాంబిక యూనియన్ నాయకులు దమ్ము చండీ,రాజు,కర్రీ నాయుడు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.