Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ హేచ్చరిక…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గంజాయి, మత్తు పదార్థాల పూర్తి నిర్మూలన లక్ష్యంగా…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరిండెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ వారి ఉత్తర్వులు మేరకు…. అమలాపురం ఎస్ డి పి ఓ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. మోహన్ కుమార్ ఆదేశాలు ప్రకారం కాట్రేనికోన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ అవినాష్ మరియు వారి సిబ్బంది ఈగల్ టీమ్ సమాచారంతో స్టేషన్ పరిధిలో చెయ్యేరు ఊరు చివర గంజాయి సేవిస్తూ పట్టుబడిన వాసంశెట్టి సోమేశ్వర సాయి పవన్,. పలివెల కార్తీక్ , ముసలి తేజ స్వరూప్, మోకా సంతోష్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 400 గ్రాములు గంజాయి, 3సెల్ఫోన్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వారిని ఈ అరెస్టు చేసి ఈ రోజున ముమ్మిడివరం గౌరవ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయగా 15 రోజులు రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడమయ్యింది కావున ఎవరైనా గంజాయి, లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించిన, కలిగిఉన్న, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా , కాట్రేనికోన మండల ఎస్సై అవినాష్ తెలియ పరిచారు