Listen to this article

సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు

జనం న్యూస్,11ఆగస్టు, జూలూరుపాడు :

రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కొత్త పెన్షన్ల మంజూరు కోసం వందల సంఖ్యలో వృద్ధులు, వితంతువులు,వికలాంగులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు అనేక మంది భర్తను కోల్పోయిన వితంతువులు ఏ ఆసరా లేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుందని ఆశతో ఎదురు చూస్తుంటే రెండేళ్లు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ గురించి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చక ఓటమి పొందారని వారిలా కాకుండా అర్హులైన నిరుపేదలకు తక్షణమే కాంగ్రెస్ పార్టీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.